ఫీడ్ ద నీడ్ కార్య‌క్రమానికి విశేష స్పంద‌న‌

- February 12, 2019 , by Maagulf
ఫీడ్ ద నీడ్ కార్య‌క్రమానికి విశేష స్పంద‌న‌

 గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆక‌లితో ఉన్న‌వారికి ఆక‌లి తీర్చేందుకు ప్రారంభించిన ఫీడ్ ద నీడ్ కార్య‌క్ర‌మానికి న‌గ‌రంలోని ప‌లు హోట‌ల్ య‌జ‌మానులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వ్య‌క్తుల నుండి విస్తృత స్పంద‌న ల‌భిస్తోంది. సోమ‌వారం నాడు ఫీడ్ ద నీడ్ కార్య‌క్ర‌మానికి చేయుత‌నందిచాల్సిందిగా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌, ఇ.పి.టి.ఆర్‌.ఐ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తిలు జీహెచ్ఎంసీలో హోట‌ల్ య‌జ‌మానులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌మావేశం నిర్వ‌హించి విజ్ఞ‌ప్తి చేయ‌డంతో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కే దాదాపు 40వేల ఫుడ్ ప్యాకెట్ల‌ను అందించ‌డానికి వివిధ సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి. వాలెంటెన్స్ డే అయిన ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన న‌గ‌రంలో ఆక‌లితో ఉన్న‌వారంద‌రికీ ఆహారాన్ని అందించాల‌ని బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా జీహెచ్ఎంసీ ప్రారంభించ‌నున్న‌ది. జ‌నాభాలో 20శాతం మందికి స‌రైన స‌మ‌యంలో ఆహారం ల‌భించ‌క ఆక‌లితో ఉంటార‌ని స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దాదాపు కోటికి పైగా జ‌నాభా ఉన్న గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో రెండు నుండి మూడు ల‌క్ష‌ల మంది ఆహారం ల‌భ్యంకాని వారు ఉంటారని అంచ‌నా. వీరంద‌రికీ ఆహారం అందించేందుకు క‌లిసి రావాల్సిందిగా జీహెచ్ఎంసీ ఇచ్చిన పిలుపుమేర‌కు క‌న్‌ఫిన‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ (సి.ఐఐ) హైద‌రాబాద్ శాఖ, హోట‌ల్స్ అసోసియేష‌న్ ఫిస్తా హౌస్, డివి మ‌నోహ‌ర్ హోటల్స్‌ల‌తో పాటు ప‌లు హోట‌ళ్లు, వ్య‌క్తులు ఫిబ్ర‌వ‌రి 14న ఫుట్ ప్యాకెట్ల‌ను అందించ‌డానికి ముందుకు వ‌చ్చారు. స్వ‌చ్ఛందంగా అందించే ఈ ఆహారాన్ని రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్‌లు, ఆటో స్టాండ్‌, నైట్ షెల్ట‌ర్లు, స్ల‌మ్‌లు, మేజ‌ర్ ఆసుప‌త్రులు ఇత‌ర ర‌ద్దీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అందించ‌డానికి ప్రాణాళిక‌లు రూపొందించింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో చేప‌ట్టిన ఈ ఫీడ్ ద నీడ్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆహారాన్ని అందించాల‌నుకునే స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వ్య‌క్తులు, సంస్థలు ఈ క్రింది ఫోన్ నెంబ‌ర్ల‌కు సంప్రదించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ర‌జినికాంత్ 95421 88884, విశాల్ 96668 63435, ప‌వ‌న్ 98499 99018 అనే నెంబ‌ర్ల‌కు ఫోన్ చేయాల‌ని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com