అక్రమ కార్మికులకు అమ్నెస్టీ చివరి అవకాశం
- December 27, 2015
జులై నుంచి డిసెంబర్ వరకు ఏర్పాటు చేసిన అమ్నెస్టీని వినియోగించుకోవాలని అక్రమ కార్మికులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31తో ఈ అవకాశం ముగియనుంది. సుమారు 8 వేల మంది వలసదారులు అమ్నెస్టీ ద్వారా సాంత్వన పొందనున్నారు. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గాల ద్వారా బహ్రెయిన్‌లోకి ప్రవేశించి ఇక్కడి చట్టాలకనుగుణంగా ఇబ్బందులు పడ్తున్న అక్రమ కార్మికుల కోసం ఆరు నెలల గడువుతో అమ్నెస్టీ అవకాశం కల్పించింది. 'నేషనాలిటీ పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ) అన్ని ప్రక్రియలూ పూర్తి చేసి, గడువును ప్రకటించింది. ఎన్ఆర్పిఏ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ఎగ్జిట్స్, సెర్చ్ అండ్ ఫాలో అప్ బ్రిగేడియర్ యూసఫ్ బిన్ అహ్మద్ అల్ ఘాతం, ఎంబసీలు తమవారిని గుర్తించి, ప్రాసెస్‌ని పూర్తి చేయాలనీ, లేదంటే గడువు దాటిన తర్వాత అక్రమ కార్మికులపై చట్టాలకనుగుణంగా శిక్షలు విధించబడ్తాయని అన్నారు. అలాగే, ఎన్పిఆర్ఏ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తుందనీ, చట్టాల్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారాయన.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







