మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు టి-హబ్ ఘన స్వాగతం
- December 27, 2015
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టి-హబ్‌కు చేరుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఉదయం తొలుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో గంటా 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టి-హబ్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఇతర ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు ఘన స్వాగతం పలికారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి, రాష్ట్రం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులను పెంచే లక్ష్యంతో టి-హబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. హబ్ విశేషాలను మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు వివరించారు. ఆ వివరాలను ఆయన ఆసక్తిగా విని తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







