2016 నుంచి యు.ఏ.ఇ. బ్యాంకు వాలెట్ సేవలు ఇక మొబైల్ ఫోన్లలో

- December 28, 2015 , by Maagulf
2016 నుంచి  యు.ఏ.ఇ. బ్యాంకు వాలెట్ సేవలు ఇక మొబైల్ ఫోన్లలో

 యు.ఏ.ఇ. బ్యాంకు ఫెడరేషన్ " డి - రిస్కింగ్ " ను  తగ్గించుకోనేందుకు మొబైల్ వాలెట్ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది  నుంచి అమల్లోనికి రానుంది. ప్రత్యెక డెబిట్ వ్యవస్థను నియంత్రించి వాటి చట్టబద్దత కోసం 49 సభ్య బ్యాంకుల   సమాఖ్య ఇందులో భాగస్వాములుగా ఉండనున్నట్లు యు.బి.ఎఫ్. చైర్మెన్ అబ్దుల్ అజీజ్ అల్ ఘురైర్ ఒక ప్రకటనలో  తెలిపారు.  జూన్ 2015 లోనే యు.బి.ఎఫ్. మొబైల్ వాలెట్ ను లాంచనంగా ప్రారంభించుకోవచ్చని ఓకే అనుకూల సంకేతం ఇచ్చినప్పటికీ , సెంట్రల్ బ్యాంకు నుండి తుది ఆమోదం కోసం ఇప్పటివరుకు వేచియున్నట్లు తెలిపారు. మొబైల్ వాలెట్ ద్వారా చెల్లించే సమాచారాన్ని మొబైల్ స్మార్ట్ ఫోన్లు , టాబ్లాయిడ్ లకు  ప్రసారం చేస్తారు. ఈ సేవలకు  ఒక ప్రత్యెక యాప్  ను మొబైల్ ఫోన్లలో అనుసంధిస్తారు. వినియోగదార్లకు ఒక ' పిన్ ' నెంబర్ ను ఇస్తారు. దీని ద్వారా ఎంత డబ్బును తమ తమ ఖాతా నుండి పొందవచ్చని తెలిపారు. 
  
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com