స్పైస్‌ జెట్‌.. హ్యాపీ న్యూ ఇయర్‌ సేల్‌

- December 28, 2015 , by Maagulf
స్పైస్‌ జెట్‌.. హ్యాపీ న్యూ ఇయర్‌ సేల్‌

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌.. హ్యాపీ న్యూ ఇయర్‌ సేల్‌ పేరుతో డిస్కౌంట్‌ ఆఫర్లను ప్రకటించింది. సంస్థ ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ లోపు ప్రయాణాలు చెయ్యాలనుకునే వారు ఈ డిస్కౌంట్‌ సేల్‌ కింద టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చునని చెప్పింది. తమ దేశీయ విమాన సర్వీసుల్లో ఒకవైపు ప్రయాణ టిక్కెట్టు ప్రారంభ ధర రూ.716(పన్నులు అదనం) అని తెలిపింది. డిసెంబరు 31 నుంచి నాలుగు రోజుల పాటు ఈ ప్రత్యేక ఆఫర్లలో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చునని చెప్పింది. ఈ ఆఫర్ల కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు కావాలనుకుంటే వాటిని రద్దు చేసుకునే సదుపాయం ఉందని రిఫండ్‌ వర్తిస్తుందని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com