జమ్మూకశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం..కశ్మీర్ రాజకీయ నేతల భద్రతా సిబ్బంది ఉపసంహరణ
- February 21, 2019
శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 155 మంది రాజకీయ నాయకులకు భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ గవర్నరు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులకు భద్రత అవసరం లేదని సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఐఏఎస్ అధికారిగా ఉండి ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన షా ఫైజల్ కు ఉన్న సెక్యూరిటీని సైతం హోంశాఖ అధికారులు తొలగించారు. దీంతో వెయ్యిమంది పోలీసులతోపాటు వంద వాహనాలు పోలీసు శాఖకు తిరిగివచ్చాయి. వీటిని పోలీసు పహరాకు వినియోగించాలని నిర్ణయించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి డబ్బులు తీసుకుంటున్న కశ్మీర్ ప్రత్యేక వాదులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖమంత్రి హెచ్చరించారు. రాజకీయ నాయకులతో పాటు 18 మంది హురియత్ నేతలు, ఎస్ఎఎస్ గీలానీ, అబ్దుల్ ఘనీ షా, యాసీన్ మాలిక్, మమ్మద్ ముసాదిఖ్ భట్ ల భద్రతా సిబ్బందిని ఉపసంహరించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







