ఇంటలీజెన్స్ నుండి హెచ్చరిక..మరో దాడికి అవకాశం..
- February 21, 2019
న్యూఢిల్లీ: పుల్వామాలాంటి దాడులు మరిన్ని చేయడానికి జైషే మహ్మద్ ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. తాన్‌జీమ్ అనే ఓ చిన్న ఉగ్రవాద గ్రూపు ద్వారా ఈ సమాచారం వెల్లడైంది. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌లు లక్ష్యంగా ఈ దాడులు జరగనున్నట్లు హెచ్చరించాయి. ఈసారి చౌకీబల్, తాంగ్‌ధర్ రూట్లలో ఈ దాడులు జరగనున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఈ రూట్లలో ఐఈడీ దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. దీనికోసం తాన్‌జీమ్ ఓ ఆకుపచ్చ రంగు స్కార్పియోను సిద్ధం చేసిందని, దాని ద్వారా ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్ మీడియా గ్రూప్‌లోని కోడ్‌ను నిఘా వర్గాలు ఛేదించాయి. పుల్వామాలో 300 కిలోల ఆర్డీఎక్స్‌తో జరిగిన దాడి ఓ ఆటబొమ్మలాంటిదని, 500 కిలోల పేలుడుకు సిద్ధంగా ఉండండి అని ఆ సందేశంలో రాసి ఉండటం గమనార్హం. కాశ్మీరీలను లక్ష్యంగా చేసుకోవడం భద్రతా బలగాలు మానుకోవాలని ఆ ఉగ్రవాద గ్రూపులు హెచ్చరించాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కూడా చెప్పడం విశేషం. ఈ సందేశం నేపథ్యంలో సరిహద్దులో చొరబాట్లు కూడా పెరిగే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్నది. గురెజ్ ప్రాంతంలో వివిధ చోట్ల నుంచి ఐదారుగురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







