బాలీవుడ్‌ని సౌదీకి తీసుకొస్తున్నారు
- February 22, 2019
జెడ్డా: ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలతో కుదురుచకున్న ఒప్పందాల నేపథ్యంలో జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. రానున్న రోజుల్లో సౌదీ అరేబియాలో పలు ఈవెంట్స్‌ని నిర్వహించనున్నామనీ, వీటిలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రదర్శనలతో ఆకట్టుకుంటారని అధికారులు తెలిపారు. సౌదీ - భారత్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని వారు చెప్పారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్, భారతదేశంలో పర్యటించిన సందర్బంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. తొలి రోజు పర్యటనలో ఇరు దేశాలకు చెందిన 400 మంది అధికారులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. 'ఇన్వెస్ట్ ఇన్ సౌదీ అరేబియా' పేరుతో ఓ ఎగ్జిబిషన్ కూడా జరిగింది. పలు సౌదీ కంపెనీలు, తమ సేవల్ని ఇక్కడ షోకేస్ చేశాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..