రేపు అభినందన్ ను విడుదల చేస్తామన్న పాక్ ప్రధాని

- February 28, 2019 , by Maagulf
రేపు అభినందన్ ను విడుదల చేస్తామన్న పాక్ ప్రధాని

పాక్ పై భారత ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది. పాక్ చెరలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను శుక్రవారం(మార్చి-1,2019) విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించారు. శాంతి ప్రక్రియల్లో ముందడుగుగా అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ప్రకటించారు. అభినందన్ ను విడుదల చేయాలని ప్రపంచదేశాలు పాక్ పై ఒత్తిడి పెంచడంతో దిక్కుతోచని స్థితిలో అభినందన్ విడుదలకు పాక్ సిద్ధమైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com