తీవ్ర దుమారం రేపుతున్న యడ్యూరప్ప వ్యాఖ్యలు
- February 28, 2019
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వైమానిక దాడులతో..బీజేపీ ఇమేజ్ పెరిగిపోయిందని, ఈ పరిణామాలన్నీ కర్ణాటకలో బీజేపీ 22 లోక్ సభ సీట్లు గెల్చుకునేందుకు ఉపయోగపడతాయని బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతపార్టీ నేతలు కూడా ఆయనపై ఫైర్ అవుతున్నారు.
ఓ వైపు పాక్ చెరలో ఉన్న భారత పైలట్ క్షేమంగా తిరిగిరావాలని దేశమంత్రి ప్రార్థనలు చేస్తున్న సమయంలో యడ్యూరప్ప ఇలంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి దేశం మొత్తం కేంద్రప్రభుత్వానికి,మన భధ్రతా బలగాలకు మద్దతుగా నిలబడిందని, ఇటువంటి సమయంలో పాక్ తో యుద్ధం , ఉగ్రదాడి తమ పార్టీకి ఎన్ని సీట్లు తెచ్చిపెడుతుందో అనే లెక్కలేసుకోవడంలో యడ్యూరప్ప బిజీగా ఉన్నారని కర్ణాటక సీఎం కుమారస్వామి విమర్శించారు. ఎన్నికల్లో అబ్ధి కోసం మన జవాన్ల త్యాగాలను వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. యడ్యూరప్ప వ్యాఖ్యలను మాజీ ఆర్మీ జనరల్,బీజేపీ నేత వీకే సింగ్ తప్పుబట్టారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ కూడా యడ్యూరప్ప వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో సరికొత్త ప్రచారానికి తెరదీసింది. భారత్ లోని అధికార పార్టీ 22 సీట్లపై కన్నేసి ఇంతమంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందంటూ పీటీఐ ట్వీట్ చేసింది. యుద్ధం ఎలక్షన్ ఆప్షనా అంటూ ప్రశ్నించింది. యడ్యూరప్ప వ్యాఖ్యల వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా యడ్యూరప్ప వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవడంతో..తన మాటలను వక్రీకరించారంటూ గురువారం(ఫిబ్రవరి-28,2019) యడ్యూరప్ప మరో ట్వీట్ చేశారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉందని తాను చెబుతూనే ఉన్నానని, కర్ణాటకలో బీజేపీ 22 సీట్లు గెల్చుకుంటుందని తాను చెప్పడం ఇదే మొదటిసారి కాదని ట్వీట్ చేశారు. మన భద్రతాబలగాలపై తనకు అత్యంత గౌరవం ఉందని అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఫైట్ చేస్తున్న మన ధైర్యవంతులైన సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







