ఇంటిని ధ్వంసం చేసిన కేసులో ఒకరి అరెస్ట్‌

- March 04, 2019 , by Maagulf
ఇంటిని ధ్వంసం చేసిన కేసులో ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: ఓ ఇంటిని ధ్వంసం చేసి, అందులో ముగ్గురు చిన్నారుల్ని బంధీలుగా చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన బురైమిలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు డ్రగ్స్‌కి బానిస అనీ, అతనికి క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వుందనీ తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ వివరాల్ని తెలిపింది. బురైమీ పోలీస్‌ స్టేషన్‌, అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దుండగుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఆసియాకి చెందిన వలసదారుడి ఇంటిపై దుండగుడు దాడి చేశాడు. నిందితుడ్ని అరెస్ట్‌ చేశామనీ, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com