భారత్కు షాక్ ఇచ్చిన ట్రంప్
- March 05, 2019
ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు తీవ్రంగా నష్టపరుస్తుంది. ఎగుమతులు తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బందిగా మారనుంది. అయితే భారత్ మార్కెట్లలో కూడా తమ ఉత్పత్తులకు ప్రిఫరెన్సినల్ ట్రేడ్ స్టేటస్ ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్ ఇందుకు అంగీకరిస్తే బారత్ కు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోతుంది. దీంతో భారత్ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో బారత్ పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. భారత్తో అమెరికా వర్తక లోటును తగ్గించే క్రమంలో ట్రంప్ ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 2017లో భారత్తో అమెరికా వాణిజ్య లోటు 2730 కోట్ల డాలర్లుగా ఉంది. పన్నుల కారణంగానే తగ్గినట్టు ట్రంప్ భావిస్తున్నారు. తమకు కూడా ప్రాధాన్యత హోదా ఇస్తే పెరుగుతుందని ట్రంప్ నమ్ముతున్నారు. 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భారీగా భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే చర్య ఇదే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







