అభినందన్ బయోపిక్!
- March 05, 2019అభినందన్ వర్ధమాన్.. భారత్ లో ఇప్పుడొక రియల్ హీరో... శత్రు సైన్యానికి చిక్కినా అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించిన ధీరుడు... దేశ రక్షణ రహస్యాలను కాపాడిన వీర జవాన్. భారత వాయుసేన వింగ్ కమాండర్ అయిన అభినందన్ వర్ధమాన్.. పాక్ సైన్యం కస్టడీలో దాదాపు రెండున్నర రోజులు గడిపినా చెదరని స్థైర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు.
ఈ క్రమంలో అభినందన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ లో దిగ్గజ ఫిలింమేకర్ గా పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రముఖ ఆడియో సంస్థ టీ-సిరీస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
అభినందన్ బయోపిక్ కు అభిషేక్ కపూర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అయితే... అభినందన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్న దానిపై విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి బాలీవుడ్ హంక్... జాన్ అబ్రహాం... అభినందన్ పాత్రపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. దర్శక నిర్మాతలు అబ్రహాంకే ఛాన్స్ ఇస్తారా... లేదంటే.. మరెవరినైనా ఎంపిక చేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్