హ్యాకింగ్‌కు గురైన బీజేపీ వెబ్‌సైట్‌

- March 05, 2019 , by Maagulf
హ్యాకింగ్‌కు గురైన బీజేపీ వెబ్‌సైట్‌

ఢిల్లీ: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఎన్నికల వేళ బీజేపీ సైట్ హ్యాకింగ్ కు గురికావడం చర్చానీయాంశంగా మారింది. బీజేపీ వెబ్‌సైట్‌ హ్యాకింగ్ కు గురైందంటూ కొందరు నెటిజన్లు చెబితే గానీ విషయం బయటకు పొక్కలేదు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన సదరు సైట్ నిర్వాహకులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రధాని నరేంద్ర మోడీ మేమ్స్ తో బీజేపీ వెబ్‌సైట్‌ లో హ్యాకర్లు అభ్యంతరకర పోస్టులు పెట్టారు. సోదరసోదరిమణులారా మీ అందర్నీ నేను ఫూల్స్ ను చేశాను అనే మేమ్స్ దర్శనమివ్వడం పార్టీశ్రేణులను కలవరానికి గురిచేసింది. ఇంకా ఇలాంటి మేమ్స్ చాలా రానున్నాయంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.

కొందరు వాటి తాలూకు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బీజేపీ సైట్ నిర్వాహకులు స్పందించారు. వెంటనే దాన్ని నిలిపివేశారు. బీజేపీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రస్తుతం మెయింటెనెన్స్ లో ఉందనే సందేశం తెరపై కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో కూడా బీజేపీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఛత్తీస్ గఢ్ బీజేపీకి చెందిన వెబ్‌సైట్‌ లోకి హ్యాకర్లు చొచ్చుకొచ్చారు. ఆ సైట్ లో పాకిస్థాన్ జెండా కనిపించడం చర్చానీయాంశమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com