స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం గోవా గవర్నర్ మృదులా సిన్హా..
- December 29, 2015
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం గోవా గవర్నర్ మృదులా సిన్హా తనవంతు కృషి చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ఆమె ఓ పాటను రాశారు. అంతేగాక, ఓ కార్యక్రమంలో ఆమె తన పాటను ఆలపించారు. కాగా, ఇప్పుడు ఆ పాటలోని కొన్ని నినాదాలను తీసుకుని గోవా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ముద్రిస్తున్నారు. ఈ పాటలో పరిశుభ్రతకు సంబంధించి నినాదాలతో పాటూ విద్యార్థులతో చేయించే ప్రతిజ్ఞ కూడా ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన ఆవశ్యకతను ఈ పాటలో వివరించారు. పరిశుభ్రంగా ఉండటానికి 'ఏం చేయాలి', 'ఏం చేయకూడదు' లాంటి అంశాలను అందులో ప్రస్తావించారు. పనాజీ, మపుసా, పాండా, మార్గోవా, విస్కోలను స్వచ్చ నగరాలుగా తయారు చేసేందుకు ఏర్పాటైన కమిటీ సభ్యులకు గవర్నర్ పలు సూచనలు చేశారు. గవర్నర్ సిన్హా.. 17నెలలుగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంపై ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరిపి, స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన వారిలో మృదులా సిన్హా కూడా ఉన్నారు
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







