యెమెన్లో ముగ్గురు సైనికుల మృతి: బహ్రెయిన్
- December 29, 2015
బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) జనరల్ కమాండ్, ముగ్గురు బహ్రెయిన్ సైనికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. సౌదీ నేతృత్వంలోని అరబ్ సమాఖ్య యెమెన్లో పోరాడుతున్న సందర్భంలో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కెప్టెన్ అహ్మద్ మహమ్మద్ అమీన్, కెప్టెన్ ముబారక్ సాద్ అల్ రుమైహి మరియు ఫస్ట్ సర్జెంట్ హసన్ అలి ఎస్కాందర్ మాజిద్ తమ జీవితాల్ని విధి నిర్వహణలో బలిచ్చారని బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ వర్గాలు వెల్లడించారు. సౌదీ సరిహద్దులో ఈ ముగ్గురూ శతృవులతో పోరాడుతూ వీరమరణం పొందారు. సైనికుల కుటుంబాలకు ఈ సందర్భంగా బిడిఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని బిడిఎఫ్ ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంది బిడిఎఫ్. అలాగే ఈ ఘటనలో గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







