నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పోలింగ్ పై నిర్ణయం..

- April 03, 2019 , by Maagulf
నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పోలింగ్ పై నిర్ణయం..

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారమే ఈ నెల 11న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. రికార్డు స్థాయిలో 185 మంది అభ్య ర్థులు పోటీ చేస్తుండటంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఉమేశ్‌ సిన్హా తెరదించారు. ఇందూరు ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందంతో కలసి ఉమేశ్‌ సిన్హా సమీక్షించారు. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన సందర్భంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక కంట్రోల్‌ యూనిట్, 12 బ్యాలెట్‌ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌యూనిట్‌ను వాడనున్నారు.ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గరిష్టంగా 4 బ్యాలెట్‌ యూనిట్లును మాత్రమే ఉపయోగించారు.

బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ నుంచి ఈవీఎంల లాట్‌ ఒకటి ఇవాళ నిజామాబాద్‌ చేరుకోనుంది. ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ఇవాళ ఫస్ట్ లెవల్ ఈవీఎం చెకింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రంలోగా ఈవీఎంలు అందుబాటులోకి రానున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిజామాబాద్‌కు 600 మంది ఇంజనీర్లను తరలిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు వీరంతా ఇందూరులోనే ఉండనున్నారు.

మరోవైపు నిజామాబాద్ లోక్‌సభ పోలింగ్‌ను వాయిదా వేయాలని ఆ స్థానం నుంచి బరిలో ఉన్న రైతు అభ్యర్ధులు కోరుతున్నారు. పోలింగ్‌ను 15 రోజులపాటు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగైతేనే తమకు న్యాయం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com