దుబాయ్‌ అల్‌ కూస్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

- April 03, 2019 , by Maagulf
దుబాయ్‌ అల్‌ కూస్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

దుబాయ్‌లోని అల్‌ కూస్ ఇండస్ట్రియల్‌ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగ ఆకాశంలోకి ఉవ్వెత్తున ఎగిసిపడింది. సమీపంలో వున్న భవనాల్లోకి పొగ దూసుకెళ్ళడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ టీమ్‌ అక్కడికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com