హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..

- April 08, 2019 , by Maagulf
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..

పర్సులో ఈ కార్డు ఉంటే చాలు. మెట్రో, బస్సు, క్యాబ్ ఏదైనా ఎక్కొచ్చు. త్వరలో హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి రానున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుపై రాష్ట్ర రవాణా శాఖ కసరత్తులు చేసి ఐటీ శాఖకు ప్రపోజల్ పెట్టింది. వీటిని పరిశీలించిన అనంతరం టెండర్లు పిలిచి కార్డు తయారీ పనులు అప్పగించనున్నారు అధికారులు.
ఈ కార్డులో క్యూఆర్ కోడ్, స్వైపింగ్ ఉంటాయి. వీటితో పాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెసిఫికేషన్లు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
 
ఇప్పటికే లండన్ మెట్రోలో అమలవుతున్న ఈ టెక్నాలజీ అక్కడ సక్సెస్ అవడంతో ఆ దిశగా ఆలోచన చేసింది తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ. దీనికి సంబంధించిన సమీక్ష గత నెల 27న జరిగింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కార్డు ద్వారా ప్రయాణంతో పాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా పార్కింగ్ సమయాల్లో, టోల్ ట్యాక్స్ చెల్లింపులకు కూడా కార్డు ద్వారా చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కార్డు కనీస రీచార్జ్ విలువ రూ.1000 ఉండనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com