హమాద్ కార్యాలయంలో కొత్త ఇనీషియేట్
- December 30, 2015
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ షేక్ హమాద్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కార్యాలయం కొత్త ఇనీషియేటివ్‌ని ప్రారంభించింది. 'ఇయర్ ఆఫ్ రీడింగ్ 2016' అనే ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్. వారంలో మూడు రోజులపాటు వివిధ అంశాలపై పఠనం అనేది ఉద్యోగులకు అలవాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇలాంటి వినూత్న ఆలోచనలు చేయడంలో హమాద్ కార్యాలయం ఎప్పుడూ ముందుంటుంది. పఠనం ద్వారా తమ స్కిల్స్‌ని పెంచుకోవడానికి ఉద్యోగులకు వీలువుతుందనీ, వివిధ అంశాలపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ద్వారా ఉద్యోగులు ఇంకా సమర్థవంతంగా పనిచేస్తారని హమాద్ కార్యాలయం డైరెక్టర్ జనరల్ సైఫ్ బిన్ మర్కాన్ కెట్బి చెప్పారు. అబుదాబీ, షార్జాలలో జరిగిన బుక్ ఎగ్జిబిషన్స్, జాతీయ ఎజెండా 2021లో భాగంగా అందరిలో పఠనాసక్తిని పెంచాల్సి ఉందని, ఆ క్రమంలో హమాద్ కార్యాలయం ముందడుగు వేసిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







