హెల్త్ అవేర్నెస్: మీ గుండె పదిలం చేసుకోండిలా
- December 31, 2015
ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి హార్ట్ ఫెయిల్యూర్. గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్‌గా చెప్తారు వైద్యులు. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ల సంఖ్య 26 మిలియన్లుగా అంచనా వేస్తున్నారు. వీరిలో 1 మిలియన్ మంది యూఎస్, బ్రిటన్లలో ఉన్నారు. కార్డియాలజిస్ట్ ఫెరాస్ బాదర్ మాట్లాడుతూ, 65 ఏళ్ళ పైబడిన వ్యక్తుల్లో హార్ట్ ఫెయిల్యూర్ అనేది సాధారణ సమస్యగా మారిందని చెప్పారు. మిడిల్ ఈస్ట్‌లో ఇంకో పదేళ్ళు తక్కువ వయసున్నవారికే, అనగా 55 ఏళ్ళ పైబడినవారికి హార్ట్ ఫెయిల్యూర్ సమస్య తీవ్రమైందని అన్నారాయన. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, సరైన రీతిలో మందులు వేసుకోకపోవడంతో హృద్రోగ బాధితులు ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్స్ బారిన పడ్తున్నట్లు వివరించారు. షేక్ ఖలీఫా మెడికల్ సిటీ, అబుదాబీకి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ హనీ సబౌర్ మాట్లాడుతూ, సెలవుల కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హార్ట్ ఫెయిల్యూర్‌తో మృత్యువాత పడ్తున్న కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. అందుకే ప్రయాణ సమయాల్లో ముందస్తుగా అన్నీ ప్లాన్ చేసుకోవాలని చెప్పారాయన.
సెలవుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి
సెలవుల్లో వున్నప్పుడు కూడా 30 నిమిషాలపాటు ఎక్సర్సైజ్ అవసరం. అలాగే ఆహారం తీసుకునేటప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోండి.
ఏం తింటున్నారనేది ముఖ్యం
తినే ఆహారంలో ఉప్పు, నూనెలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత తక్కువ ఆహారం తీసుకోవడం ఉత్తమం.
డాక్టర్ సలహా తీసుకోండి
మీ సెలవుల్ని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటే, ముందుగా డాక్టర్ సలహా తీసుకోండి. ఆయన ఇచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా సెలవుల్ని ప్లాన్ చేసుకుంటే మంచిది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







