ఉత్తరం

- May 14, 2015 , by Maagulf
ఉత్తరం

సమాచారాన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేయడానికి ఉపయోగించే సాధనం. పాపం అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి బలైపోయావు. గతంలో నీ రాక గురించి వారాలు, నెలల తరబడి వేచి చూసేవారు. ఎక్కువగా కుటుంబ క్షేమ సమాచారాలు చేరవేసేవాడివి. నీవు బాగా బ్రతికినంత కాలము సమాజంలో బంధాలు, బాంధవ్యాలు, కష్టసుఖాలు పంచుకోవడానికి నీవుచేసిన కృషి మరువరానిది. కొన్ని సందర్భాల్లో నీరాక ఆలస్యమైనప్పుడు తంతి కార్యాలయానికి (పోస్టాఫీసు) వెళ్లి మరీ నీ గురించి వాకబు చేసేవాళ్ళు. ఎందుకంటే మనుషుల మధ్య వారధి నువ్వే! నీ సేవ మరపురానిది, మరువలేనిది మరియు మరలరానిదిగా మిగిలిపోయింది. నిన్ను మరల బ్రతికించేందుకు కూడా చేరుకోలేని చిరునామాకి చిరస్థాయిగా చేరిపోయావు, చివరికి. కానీ నీవు మాకందించిన గుర్తులు ప్రత్యక్ష సాక్షులుగా మా అందరి హృదయాల్లో నిక్షిప్తంగా నేటికీ జీవిస్తూనే ఉన్నావు. మానవాళి సహజీవనంలో నీవు పోషించిన పాత్ర శాశ్వతము అని చెప్పడంలో సందేహం లేదు.

 

                                                                                 -----యస్.పి. సోమ సుందర్, దుబాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com