రాఫెల్ డీల్ వ్యవహారంలో మరో దుమారం

- April 14, 2019 , by Maagulf
రాఫెల్ డీల్ వ్యవహారంలో మరో దుమారం

రాఫేల్ ఒప్పందంలో ఇప్పటికే తలపట్టుకున్న కేంద్రానికి మరో షాక్ ఇచ్చింది ఫ్రెంచ్ మీడియా. డీల్ అంతా సజావుగానే జరిగిందంటూ కాంగ్రెస్ ఆరపణలను కొట్టిపారేస్తున్న మోదీ ప్రభుత్వానికి రోజుకో లీకులతో తలబొప్పికట్టిస్తోంది. అనిల్ అంబానీకి ఫేవర్ చేసేందుకు రాఫెల్ ఒప్పందం జరిగిందన్నది ప్రతిపక్షాల వాదన. ఈ ఆరోపణలకు బలాన్నిస్తూ ఫ్రెంచి పత్రిక ‘లె మాండ్’ ప్రచురించిన కథనం ఇండియాలో దుమారం రేపుతోంది. రాఫెల్ డీల్ తర్వాత ప్రెంచ్ లో అనిల్ అంబానీ కంపెనీకి ఏకంగా 1200 కోట్ల రూపాయల పన్ను మాఫీ జరిగినట్లు ఫ్రెంచ్ పత్రిక బయటపెట్టింది. నష్టాల్లో ఉన్న తమ కంపెనీకి పన్ను మినహాయింపు ఇవ్వాలని అనిల్ అంబానీ ఐదేళ్ల పాటు కోరినా ససేమిరా అన్న ఫ్రెంచ్ ప్రభుత్వం.. రాఫెల్ ఒప్పందం తర్వాత అనిల్ అంబానీ విషయంలో రాజీపడింది.

రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి 30 వేల కోట్ల రూపాయలు లాభం చేకూర్చేలా మోదీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి మీరీ ఈ డీల్ జరిగిందని విమర్శిస్తున్నాయి. అయితే..ఈ 30 వేల కోట్లకు తోడు ఫ్రెంచ్ లోనూ ప్రయోజనాలు చేకూరాయని ఫ్రెంచ్ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చింది. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు అనుబంధంగా రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్ అనే కంపెనీ ఉంది. ఫ్రాన్స్ లో కేబుల్ నెట్ వర్క్, ఇతర టెలికం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యవహరాలు చూస్తు ఉంటుంది. అయితే..ఈ కంపెనీలో 2007 నుంచి 2012 వరకు పన్ను బకాయి పడింది. సర్ ఛార్జ్ , వడ్డీలతో కలుపుకొని బకాయి 12 వందల కోట్లకు చేరుకుంది. దీంతో రిలయన్స్ ఫ్లాగ్ కు ఫ్రాన్స్ ప్రభుత్వం నోటీసులిచ్చింది. తమ కంపెనీ నష్టంలో ఉందని..అంత చెల్లించుకోలేనని రిలయన్స్ ఫ్లాగ్ చేసిన విజ్ఞప్తిని ఫ్రాన్స్ ప్రభుత్వం నిరాకరించింది. అయితే..2015లో మోదీ ఫ్రాన్స్ పర్యటన, రాఫెల్ డీల్ తరువాత ఫ్రాన్స్ మనస్సు ఒక్కసారిగా కరిగిపోయింది. రిలయన్స్ ఫ్లాగ్ 1200 కోట్ల పన్ను మినహాయింపు ఇస్తూ 56 కోట్లతోనే లెక్క క్లోజ్ చేసింది.

అయితే.. పన్ను మినహాయింపు కథనాలను ఆర్ కమ్ కొట్టిపారేసింది. తమ కంపెనీ నష్టాల్లో ఉంటే..చట్ట విరుద్ధంగా భారీగా పన్ను విధించందని..దీనిపై కోర్టును ఆశ్రయించామని వివరణ ఇచ్చింది. తమ న్యాయపోరాటంతో ఫ్రాన్స్‌ తమతో రాజీ పరిష్కారం కింద 56కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com