ఫ్లూ కేసుల పెరుగుదల నేపథ్యంలో యూఏఈ స్కూల్స్‌ వార్నింగ్‌

- April 17, 2019 , by Maagulf
ఫ్లూ కేసుల పెరుగుదల నేపథ్యంలో యూఏఈ స్కూల్స్‌ వార్నింగ్‌

యూ.ఏ.ఈ:డాక్టర్లు, స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు 'పెరుగుతున్న ఫ్లూ కేసుల' విషయమై హెచ్చరికలు జారీ చేశాయి. ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ సైన్స్‌, పేరెంట్స్‌కి గత వారం ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. సెలవుల తర్వాత తిరిగి వచ్చిన కొందరు విద్యార్థుల కారణంగా ఫ్లూ విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఐఎస్‌సిఎస్‌ నాడి అల్‌ షెబా ప్రిన్సిపల్‌ నవీద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ, వాతావరనంలో మార్పులు, అలాగే సెలవుల కోసం వెళ్ళి తిరిగొచ్చిన విద్యార్థుల కారణంగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయనీ, ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు. ఫ్లూ లక్షణాలు కన్పిస్తే, ఇంటి వద్దనే వుంచి పిల్లలకు వైద్య చికిత్స అందించాలనీ, స్కూల్‌కి పంపించడం వల్ల ఇతరులకు ఆ ఫ్లూ సోకే అవకాశం వుందని వైద్యులు, స్కూల్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి. మెడియార్‌ హాస్పిటల్‌ దుబాయ్‌కి చెందిన పిడియాట్రీషియన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ దీపక్‌ గాందీ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్స్‌ తర్వాత కూడా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని వాతావరణ మార్పుల కారణంగానే ఇది జరుగుతోందనీ, పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com