డిగ్రీ అర్హతతో బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు..

- April 17, 2019 , by Maagulf
డిగ్రీ అర్హతతో బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు..

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌) ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 16 నుంచి మే6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 145

ఇంజనీర్ ట్రైనీలో పోస్టుల సంఖ్య: 100
ఇందులో మెకానికల్ : 40
ఎలక్ట్రికల్: 30
సివిల్ : 20
కెమికల్ : 10
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యూయల్ డిగ్రీ
వయోపరిమితి: 01.04.2019 నాటికి 27 సంవత్సరాలు. 01.04.1992 తర్వాత జన్మించిన వారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పీజీ డిగ్రీ (ఇంజనీరింగ్/ బిజినెస్
అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్) ఉన్నవారి 29 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 45
హెచ్‌ఆర్: 20
ఫైనాన్స్ : 25
అర్హత: హెచ్‌ఆర్ విభాగానికి 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ/ డిప్లొమా (హెచ్‌ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్/సోషల్ వర్క్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)
ఉండాలి. పర్సనల్ మేనేజ్‌మెంట్/లేబర్ వెల్ఫేర్/ హెచ్‌ఆర్ఎమ్ స్పెషలైజేషన్లుగా ఉండాలి.
ఫైనాన్స్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సీఏ, సీడబ్ల్యూఏ చదివి ఉండాలి.
వయోపరిమితి: 01.04.2019 నాటికి 29 సంవత్సరాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టుల ప్రకారం 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాతపరీక్షకు 75%,
ఇంటర్వ్యూకు 25% ప్రకారం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో పేస్కేలు రూ.50,000 – రూ.1,60,000 (బేసిక్ పే రూ.50,000) ఉంటుంది. శిక్షణ అనంతరం
ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ హోదాలో పే స్కేల్ రూ.60,000 – రూ.1,80,000 (బేసిక్ పే రూ.60,000) చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.04.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.05.2019
పరీక్ష తేదీ: మే25, 26 తేదీల్లో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com