యూఏఈ రెసిడెంట్స్‌కి కొత్త ఫైనాన్షియల్ స్కామ్‌పై హెచ్చరిక
- April 19, 2019
అబుదాబీ:నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ప్రతినిథులుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై అబుదాబీ పోలీస్ పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఈ వార్నింగ్‌ని జారీ చేయడం జరిగింది. బహుమతులు గెలిచారంటూ ఫోన్ చేయడం లేదా టెక్స్‌ట్ మెసేజ్ చేయడం ద్వారా అమాయకులకు వల విసురుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. క్రిమినల్ సెక్యూరిటీ డివిజన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఒమ్రాన్ అహ్మద్ అల్ మజ్రోయి మాట్లాడుతూ ఇలాంటి నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి వుందని అన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్‌కి ప్రజలు స్పందించవద్దని ఆయన సూచించారు. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డుల వివరాలు గోప్యంగా వుంచుకోవాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







