భారత మహిళ ప్రసవానికి సహకరించిన ఎమిరేటీ మహిళా కాప్
- April 20, 2019
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద భారతదేశానికి చెందిన ఓ మహిళ ప్రసవ వేదనకు గురికాగా, అదే ఎయిర్ పోర్ట్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హన్నన్ హుస్సేన్ మొహమ్మద్ స్పందించారు, బాధిత మహిళకు ప్రసవంలో సహాయపడ్డారు. ఆ క్షణంలో బాధితురాలికి అండగా నిలిచారు. ఇన్స్పెక్షన్ రూమ్‌కి బాధిత మహిళను హుటాహుటిన తరలించి, ఆ మహిళకు ప్రసవం అయ్యేలా చేశారు. పుట్టిన తర్వాత బిడ్డ బేబీకి శ్వాస అందకపోవడంతో, కార్డియో పల్మనరీ రిసర్సియేషన్ (సిపిఆర్) కూడా నిర్వహించారు హనన్. ఆ తర్వాత ఆ మహిళ, ఆమె బిడ్డను ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. దుబాయ్ పోలీస్ - జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి అతిక్ బిన్ లహెజ్, హనన్ని సత్కరించారు. ఓ మహిళకు ప్రసవం విషయంలో సాయపడటం చాలా ఆనందాన్నిచ్చిందని హనన్ చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







