అబుధాబిలో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన పూర్తి
- April 21, 2019
అబుధాబి:గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుధాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శనివారం (ఏప్రిల్ 20, 2019) శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్‌వాసి శ్రీ అక్షర్ - పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) అధిపతి మహాంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి - దుబాయ్ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు.
దేవాలయానికి అవసరమైన స్థలాన్ని యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అప్పగించారు. 2015 లో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా ఈ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అబుదాబిలో హిందూ దేవాలయం లేదు. పూజలు, ప్రార్థనల కోసం దుబాయ్‌కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ రెండు ఆలయాలు, గురుద్వార ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపికి చెందిన బి.ఆర్.శెట్టి అబుదాబిలో ప్రముఖ వ్యాపారవేత్త. 1968లో ఆయన ఉడిపి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రధాని మోడీతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. మోడీ యూఏఈ పర్యటనలో బి.ఆర్.శెట్టి కీలక పాత్ర పోషించారు.ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి టి.టి.డి JEO లక్ష్మీకాంతం దంపతులు హాజరయ్యారు.

_1555784385.jpg)




తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







