శ్రీలంక పేలుళ్ళ కేసు : ఏడుగురు అనుమానితుల అరెస్ట్

- April 21, 2019 , by Maagulf
శ్రీలంక పేలుళ్ళ కేసు : ఏడుగురు అనుమానితుల అరెస్ట్

కొలంబో:వందల మంది జీవితాలను అగాధంలోకి నెట్టిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఏడుగురు అనుమానితులను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి జరిగిన 8 వరుస బాంబు పేలుళ్ళలో 190 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 27 మంది విదేశీయులు, 350 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.

ఎనిమిదో పేలుడు కొలంబో శివారులోని దెమటగోడలో సంభవించింది. ఈ ప్రాంతంలో అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఈ అనుమానితులు ఓ ఇంట్లో ఉండగా పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఆదివారం ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 8 పేలుళ్ళు సంభవించినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్ళు, ఓ గెస్ట్ హౌస్‌ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలిపింది. ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com