బంపర్ ఆఫర్‌తో జియో గిగాఫైబర్..
- April 24, 2019
టెలికం దిగ్గజం జియో మరో సంచలనానికి సిద్ధమైంది. మార్కెట్లో జియో సృష్టించిన పేరును గుర్తుంచుకునేందుకు మరో అద్భుత సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జియో గిగాఫైబర్ కింద బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలన్నింటినీ అందిస్తామని కంపెనీ గతంలోనే తెలిపింది. ప్రస్తుతం రిలయెన్స్ గిగాఫైబర్‌ను ప్రయోగాత్మకంగా పలుచోట్ల పరిశీలిస్తుంది.
ఇంకా అధికారికంగా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైలో గిగాఫైబర్ వన్‌టైమ్ డిపాజిట్ కింద రూటర్ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. రిలయెన్స్ జియో గిగాఫైబర్ మొదట 29 పట్టణాల్లో ప్రారంభం కానుందని.. అందులో ముఖ్యంగా న్యూఢిల్లీ, ముంబైలో మొదటి దశలో ఉంటుందని తెలుస్తోంది. జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







