ఈ ఉల్లంఘనకు పాల్పడితే 100,000 దిర్హామ్‌ల జరీమానా, జైలు శిక్ష
- April 30, 2019
యూ.ఏ.ఈ:ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ ఇన్ దుబాయ్ (ఇఎడి), 200 కిలోల ఓయ్స్టర్స్ని స్మగ్లింగ్ చేస్తుండగా సీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇఎడి వెల్లడించింది. విక్రయించేందుకోసం పెద్ద మొత్తంలో ఓయ్స్టర్స్ని కొందరు వ్యక్తులు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారికి జరీమానాతోపాటు, జైలు శిక్ష కూడా విధించే అవకాశముందని అధికారులు వివరించారు. ఓయ్స్టర్స్ని వెంటనే విడిచిపెట్టడం జరిగిందనీ, ఎకో సిస్టమ్‌లో వాటి పాత్ర చాలా ముఖ్యమైనదని ఇఎడి పేర్కొంది. ఫెడరల్ చట్టం నెంబర్ 23 (1999) ప్రకారం, ఓయ్స్టర్స్ ఎక్స్ట్రాక్షన్కి 6 నెలలకు తక్కువ కాని విధంగా జైలు శిక్ష, అలాగే 50,000 నుంచి 100,000 దిర్హామ్‌ల జరీమానా విధించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







