అందాల పోటీల్లో విజేతగా తెలుగమ్మాయి
- May 05, 2019

చెన్నై: అందాల పోటీలో తెలుగమ్మాయి సత్తా చాటింది. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 పోటీల్లో అక్షర రెడ్డి విజేతగా నిలిచారు. 22 రాష్ట్రాలకు చెందిన 240 మందికి అందగత్తెలు పోటీపడగా.. అదృష్టం అక్షరను వరించింది. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఫైనల్స్‌లో అక్షర మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 కిరీటాన్ని అందుకుంది.
ప్రపంచ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం
మిస్ సూపర్ గ్లోబ్ ఇండియాగా ఎన్నికైన అక్షర రెడ్డి అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరగనున్న మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ 45 దేశాలకు చెందిన సుందరాంగులతో ఆమె పోటీ పడనున్నారు. భారత్ తరఫున ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనాలన్నది తన కల అని, మిస్ సూపర్ గ్లోబ్ ద్వారా అది నెరవేరడం సంతోషంగా ఉందని అంటున్నారు అక్షర.
తెలుగు కుటుంబ నేపథ్యం
తెలుగువారైన అక్షరరెడ్డి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. తండ్రి సుధాకర్, తల్లి పేరు గౌరి. చిన్నప్పటి నుంచే బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనాలని కలలు గన్న అక్షర.. 2011లో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నారు. 2016లో మిస్ అమరావతి పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ టైటిల్‌పై ధీమా
ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొని భారత ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమంటోంది అక్షర రెడ్డి. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతానని అంటోంది. దుబాయ్‌లో జరిగే పోటీల కోసం అందానికి మరిన్ని మెరుగులద్దుకోవడంతో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సులో చేరాలని భావిస్తోంది. మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ పోటీలో పాల్గొనే మిగతా కంటెస్టెంట్లను వెనక్కి టైటిల్ ఎగరేసుకుని పోతానని ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







