ఉల్లిపాయల తొక్కలతో కొన్ని అద్భుత మైన చిట్కాలు..

- May 05, 2019 , by Maagulf
ఉల్లిపాయల తొక్కలతో కొన్ని అద్భుత మైన చిట్కాలు..

ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుటి కాలంలో ఉల్లిపాయల రేటు ఎక్కువగా ఉన్నాయి. కానీ, మనం ఏం చేస్తామంటే.. తక్కువగా ఉండేవి తీసుకుంటాం.. అయితే మనలో చాలామంది ఉల్లి తొక్కలను పారేస్తుంటారు. నిజానికి వాటితో చాలా ప్రయోజనాలున్నాయని చెప్తున్నారు. అవేంటంటే..

1. మీ ఇంట్లో దోమల బెరద ఎక్కువగా వుంటే.. ఓ గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పెడితో దోమలు ఉండదు. ఎందుకంటే.. దోమలకు ఉల్లిపాయల వాసన, ఘాటు పడదు.

2. ఉల్లి తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. మరునాడు ఉదయాన్నే ఆ నీటితో శరీర నొప్పులు ఉన్నప్రాంతాల్లో రాసుకుంటే నొప్పులు త్వరగా తగ్గుముఖం పడుతాయి. ఆ నీటిని చర్మానికి రాసుకుని అరగంట తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి.

3. జుట్టు రాలుతున్నా, చుండ్రు సమస్య ఉన్నా.. ఉల్లి తొక్కల్ని వాడేసుకోవాలి. ఎలా అంటే, ఉల్లి తొక్కల్ని మెత్తగా నూరి తలకు పట్టించాలి. పావుగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే.. జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు, తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఉల్లిలోని సల్ఫర్ పాడైన, సన్నబడిన వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. ముఖ్యంగా తెల్లజుట్టును గోధుమ, బంగారం రంగులోని మార్చుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com