యాపిల్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా??
- May 08, 2019
లెమన్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ అంటూ చాలా టీలే తాగుతుంటారు టీ ప్రియులు. మరి యాపిల్ టీ గురించి ఎప్పుడూ విని వుండరు. రోజుకో యాపిల్ తింటే వైద్యునికి దూరంగా ఉండొచ్చు అని అంటారు. యాపిల్ టీని తాగడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు అని అంటున్నారు న్యూట్రీషియనిస్టులు. ఈ టీ రుచిగా ఉండడంతో పాటు శరీరం ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే యూరప్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ యాపిల్ టీ రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదర సంబంధ సమస్యలకు యాపిల్ టీ చక్కటి ఔషధం. యాపిల్ టీ రోజూ తీసుకుంటే సౌందర్యం పెరుగుతుంది. చర్మం కాంతి వంతంగా ఉంటుంది. జాయింట్ పెయిన్ సమస్యలను నివారిస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఇక ఈ యాపిల్ టీని ఎలా తయారు చేయాలో చూద్దాం..
ఓ పాత్రలో టీకి సరిపడా నీళ్లు తీసుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసిన యాపిల్‌ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి మరుగుతున్న నీటిలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత టీ పొడి, లవంగ దాల్చిన చెక్కపొడి కొద్దిగా వేసి కలిపి మరికాసేపు మరిగించాలి. తరువాత దించి కొద్దిగా తేనె కలిపి తాగాలి. రోజులో ఏదో ఒక టైమ్‌లో ఈ యాపిల్ టీ ట్రై చేయండి. అందంతో పాటు ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..