అరటి పువ్వుతో స్త్రీపురుషులకి 6 ప్రయోజనాలు...

- May 10, 2019 , by Maagulf
అరటి పువ్వుతో స్త్రీపురుషులకి 6 ప్రయోజనాలు...

ప్రస్తుతకాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఆ సమస్యలన్నింటికి మందులు వల్ల అప్పటికి తగ్గినా పూర్తిగా నయం అవ్వదు. అలాకాకుండా ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాల ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలని తగ్గించుకోచ్చు. అలాంటి వాటిల్లో అరటిపువ్వు ఒకటి. ఇది పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. ఇంకా దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

1. అరటిపువ్వు గుండె రూపంలో ఉంటుంది. కొంతమంది అరటిపువ్వును ఒక కూరగాయగా పరిగణిస్తారు. అంతేకాకుండా అరటిపువ్వును సలాడ్‌గా, సూప్‌లాగా తయారుచేసి వాడుతారు.

2. అరటిపువ్వుని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం అవుతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

3. ఇందులోని ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ మీద ప్రభావం సక్రమంగా పనిచేసేటట్లు దోహదపడుతుంది.

4. వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో బాగంగా చేర్చుకోవడం వల్ల వీర్యవృద్దికి
దోహదపడుతుంది.

5. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ది చేస్తుంది.

6. అరటిపువ్వు ఆడవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అరికట్టడానికి ఇది పనికొస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com