జనవరి 1వ తేదీ నుంచి అమల్లోనికి వచ్చిన యు.ఏ.ఈ కొత్త కార్మిక విధానాలు
- January 01, 2016
వర్క్ పర్మిట్ ను ఏ విదంగా పొందవచ్చు ?
కొత్త ఏడాది నుంచి మూడు నూతన్ కార్మిక నియమాలు అమలులో రానున్నాయి. ఇవి రాజ్యాంగం మరియు అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలు ఏకరీతిగా ఉండేలా రూపొందించినట్లు కార్మిక మంత్రి , జాతీయ అర్హతల సంస్థ చైర్మన్ సక్ర్ ఘోబాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 24 / 7 ఎమిరేట్స్ ఈ 3 నిబంధనలను గూర్చి వివరించారు. ఇందులోఉద్యోగ ఒప్పందం ముఖ్యమైనది.
మొదటి భాగం : కార్మికుని సొంత భాషలోనే ఒప్పందం కుదుర్చుకోవాలి
రెండవ భాగం : ఒప్పంద కార్మికుడిని ఎలా విధుల్లోనుంచి తప్పించవచ్చు ?
నూతన యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ కార్మిక నియమాలు మూడవ మరియు ముగింపు భాగం
ఈ విధంగా వివరిస్తుంది.
గతంలో ఉద్యోగి పని ఒప్పందం ముగిసిన తర్వాత, నూతనంగా పని అనుమతి ఆమె లేక అతడు
ఏ విధంగా చేయవచ్చునో వివరిస్తుంది.
(1) నిర్ణీత కాల ఒప్పందం :
1. ఒప్పందపు గడువు ముగిసినప్పటకీ, తిరిగి ఆరంబికపోవడం
2. రెండు పక్షాలు ( కార్మికుడు , యజమాని ) పరస్పరం సమ్మతించుకొన్న పని ఒప్పంద కాల పరిమితి కనీసం 6 నెలలు ఉండాలి. యజమాని అనుమతితో వెళితే , సంబంధిత యజమాని తన వద్ద పని చేసిన కార్మికుని నైపుణ్య స్థాయిని 1,2, 3 తరగతులుగా విభజించి , ఆ వర్గీకరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉండాలి.
3. ఆరు నెలల కాలపరిమితి పూర్తి చేసిన కార్మికునికి అతని యజమాని తన వద్ద పనిచేసిన కాలంలో ఆయా కార్మికుని పని తీరుపై ఒక నివేదికను అందచేయాలి. ఈ నివేదికలో కార్మికుని నైపుణ్య స్థాయిని ఉటంకిస్తూ 1,2,3 తరగతులుగా విభజించి ఆ వర్గీకరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉండాలి.
4. యజమాని కార్మికునికి మధ్య ఉన్న సంబంధాలలో ఇరువురులో ఎవరైనా ఏకపక్షంగా ఏ కారణం లేకుండా , విధులను వదిలివేస్తే, ఈ దిగువ సూచించినవి చేయాల్సి ఉంటుంది.
(ఎ) కాల పరిమితి ముగిసిన కార్మికుడు తన యజమానికి ఆమె లేక అతడు లిఖితపూర్వకంగా తన ఒప్పందం ముగియబడిందని తాను పనిచేసిన యజమానికి తెలియచేయాలి. గతంలో వారు ఇరువురి మధ్య కుదిరిన ఒప్పందం బట్టి తెలియచేయాల్సి ఉంది. అయితే తాను పని మాని వేసే కాలానికి ఒక నెల ముందు లేదా 3 నెలల ముందు తన యజమానికి విధిగా తెలియచేయాల్సిఉంది.
ఈ ప్రక్రియ అనంతరం వీరు ఇరువురు 3 నెలల నోటీసు పీరియడ్ లోనికి ప్రవేశిస్తారు.
(బి) కానీ, ఈ నోటీసు పీరియడ్ కాలంలో కార్మికుడు తప్పనిసరిగా 3 నెలల నోటీసు పీరియడ్ కాలంలో తన విధులను ఖచ్చితంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
(సి) పని మానివేసే కార్మికునికి యజమాని అగ్రిమెంట్ ప్రకారం వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్ష్యంలో ఆయా కార్మికునికి 3 నెలల వేతనం ఒక్కసారే కార్మికునికి ఇచ్చి ఆ యజమాని తన వద్ద నుంచి పంపించవచ్చు.
2. అనిర్ణీత కాల ఒప్పందాలు
(1) రెండు పక్షాలు ( కార్మికుడు , యజమాని ) పరస్పర సమ్మతితో కనీసం 6 నెలలు పనిచేస్తే, వారు ఇరువురు ఒక అవగాహనతో మిగిలిన కాల వ్యవధిని రద్దు చేసుకోవచ్చు. సంబంధిత యజమాని తన వద్ద పనిచేసిన కార్మికుని నైపుణ్య స్థాయిని బట్టి 1,2,3 తరగతులుగా విభజించాలి.ఆ వర్గీకరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉండాలి.
(2) రెండు పక్షాలలో ఒకరైన కార్మికుడు తన యజమానికి తాను విధుల నుంచి తొలగనున్నట్లు ముందుగా ప్రకటించాల్సి ఉంది. కానీ, ఒప్పందంలో నిర్ణయించిన ప్రకారం మిగిలిన కాల వ్యవధిని పూర్తి చేయాలి. అది ఒక నెలకు తక్కువ కారాదు. 3 నెలలకు ఎక్కువ కారాదు. ఈ షరతు ప్రకారం సంబంధిత కార్మికుడు తన యజమాని వద్ద కనీసం 6 నెలల కాల వ్యవధిని పూర్తి చేసి ఉండాలి. ఆ యజమాని వద్ద పని చేసిన కార్మికుని నైపుణ్యతను బట్టి 1,2,3 తరగతులుగా విభజించాలి. ఆ వర్గీకరణ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా ఉండాలి.
(3) కార్మికుడు 6 నెలల కాల వ్యవధి కన్నా తక్కువ కాలం యజమాని వద్ద పనిచేస్తే , ఏ కారణం చూపకుండా, ఆ యజమాని పని ఒప్పంద రద్దు చేసుకోవచ్చు.
3. అన్ని ఒప్పందాలకు - నిర్ణీత - ఆనిర్ణీత ఒప్పందాలు
1 మరియు 2 వది నిబంధన ప్రకారం , కార్మికుడు కొత్త పని అనుమతి పొందవచ్చు.
(1) కార్మికునికి సంబంధించి చట్టపరమైన లక్ష్యాలు ఉన్నప్పటకీ, సంబంధిత యజమాని నెరవేర్చక పోవడం వలన, అలాగే, కార్మికుడ్నియజమాని 60 రోజులు పని చేయించుకొని ఏ మాత్రం వేతనం ఇవ్వకపోతే, ఆ కార్మికుడికి మరో నూతన్ ఉపాధికి అర్హుడు అవుతాడు.
(2) కొత్త వర్క్ పర్మిట్ కార్మికునికి దొరకడానికి మరొక కారణం ఏమిటంటే , కార్మికుడు తాను పని చేసిన వ్యాపారస్థానం కు వ్యతిరేకంగా పిర్యాధును ఇవ్వవచ్చు, తాను పని చేసిన చోట రెండు నెలలుగా పని లేకుండా వ్యాపారస్థానం మూసి ఉంటె, షాపు మూసివేతకు కారణం లబెర్ ఇన్స్ పెక్టర్ ఇచ్చిన నివేదిక, వ్యాపారస్థానం కు వ్యతిరేకంగా కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ను కార్మిక మంత్రిత్వశాఖకు పంపించవచ్చు. దీని కారణంగా, ఆ కార్మికుడు కొత్త వర్క్ పర్మిట్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
(3) లేబర్ ఇన్స్ పెక్టర్ పంపిన నివేదిక ఆధారంగా లేబర్ కోర్టు కార్మికునికి అనుకూలంగా కనుక తీర్పును వెలువరిస్తే , ఆ కార్మికుడు వేతనం మరియు అన్ని ఇవ్వవలసిన చెల్లింపులకు అర్హుదవుతాదు. ఈ పేర్కొన్న అధికరణలో మాదీరిగా కార్మికుడు కనుక ఉంటె, సంబంధిత కార్మికుడు నూతన వర్క్ పర్మిట్ కు అర్హుదవుతాదు.
--శాలెం బాబు అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









