హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్న వి.వి.వినాయక్
- May 14, 2019
వి.వి.వినాయక్.. మాస్ అండ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. అదుర్స్‌తో కామెడీని కూడా హ్యాండిల్ చెయ్యగలడని ప్రూవ్ చేసాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం:150 తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో చేసిన ఇంటిలిజెంట్, వినయ్ కెరీర్‌ని డైలమాలోకి నెట్టేసింది. కట్ చేస్తే, వినాయక్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకు తెర వెనక యాక్షన్ చెప్పిన ఆయన త్వరలో మరొకరు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యనున్నాడు. సాధారణంగా సీన్ షూట్ చేసేటప్పుడు హీరోలకు తను నటించి చూపిస్తుంటాడు వినాయక్.. చిరంజీవి ఠాగూర్, ఖైదీ నెం:150 సినిమాల్లో కాసేపు తెరపై తళుక్కుమన్నాడు.
ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వినయ్‌ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా తీసిన మొదటి సినిమా దిల్‌కి డైరెక్టర్ వినాయకే. తనని నిర్మాతగా పరిచయం చేసిన దర్శకుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యనున్నాడు దిల్ రాజు. శరభ ఫేమ్ ఎన్. నరసింహరావు ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందబోయే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







