తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆర్‌ఎస్ చౌహాన్ పేరు సిఫార్సు...
- May 14, 2019
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్‌ను..పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పడిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవి కొద్దిరోజులుగా ఖాళీగా ఉన్నందున, జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్‌ను ఆ పదవికి సిఫారసు చేస్తున్నట్టు కొలీజియం పేర్కొన్నది. జస్టిస్ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయినప్పటి నుంచి తెలంగాణ హైకోర్టు సీజే పదవి ఖాళీగా ఉన్నది. రాజస్థాన్ హైకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందిన జస్టిస్ చౌహాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా పనిచేస్తున్నారు.
తెలంగాణ హైకోర్టు సీజే బాధ్యతల నిర్వహణకు జస్టిస్ చౌహాన్ అన్నిరకాలుగా సమర్థుడని కొలీజియం పేర్కొన్నది.
జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ క్రిమినల్, రాజ్యాంగ వ్యవహారాలు, సివిల్ సర్వీసెస్ అంశాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన 1980లో అమెరికా ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తిచేసిన ఆయన.. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. అదే ఏడాది రాజస్థాన్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదుచేసుకున్నారు. 2005 జూన్ 13న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చౌహాన్.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడే క్రమంలో తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చి ఇక్కడే కొనసాగుతున్నారు.
జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ తర్వాత తెలంగాణ హైకోర్టులో రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసుచేసింది. తెలంగాణతో పాటు హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ హైకోర్టులకు కూడా ప్రధాన న్యాయమూర్తులను నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం మరో ముగ్గురు జడ్జీల పేర్లను సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలీజియం ఈ నెల 10వ తేదీన చేసిన తీర్మానాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఢిల్లీ హైకోర్టుకు జస్టిస్ డీఎన్ పటేల్, మధ్యప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ఏఏ ఖురేషీ, హిమాచల్ ప్రదేశ్‌కు జస్టిస్ వీ రామసుబ్రమణియన్ పేర్లను కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
తాజా వార్తలు
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!