వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..

వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్పాప్‌ యూజర్లకు ఆ సంస్థ షాకింగ్‌ న్యూస్ అందించింది. యాప్‌ అంత్యంత శక్తివంతమైన వైరస్‌ బారిన పడినట్లు తాజాగా వెల్లడించింది. వాట్సాప్‌ కమ్యూనికేషన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఓ స్పై వేర్‌ కొన్ని మొబైల్‌ ఫోన్లలోకి ప్రవేశించిందని తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే అడ్వాన్స్‌డ్‌ సైబర్‌ యాక్టర్‌ దీన్ని రూపొందించినట్లు గుర్తించింది. వాయిస్‌కాలింగ్‌ ద్వారా మొబైల్‌ టార్గెట్‌ చేసిందని తెలిపింది.

వాట్సాప్‌ భద్రతా వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఈ స్పై వేర్‌ వచ్చిందని, ఈ లోపాన్ని ప్రస్తుతం సరిచేసినట్లు కంపెనీ వెల్లడించింది.. వెంటనే 1.5 బిలియన్ల యూజర్లు తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. వాట్సాప్‌ వాయిస్‌ కాలింగ్‌ ద్వారా వచ్చే మిస్డ్‌ కాల్స్‌తో ఈ మాల్వేర్‌ ఫోన్లలోకి ప్రవేశించినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మే మొదటివారంలో ఈ మాల్‌వేర్‌ను గుర్తించినట్లు తెలిపింది.

వాయిస్‌ కాలింగ్స్‌కు అదనపు భద్రతా ఫీచర్లను పెడుతుండగా తమ టీం ఈ లోపాన్ని గుర్తించింది తెలిపింది. వాట్సాప్‌లోని ఈ లోపాన్ని అదనుగా చేసుకుని స్సైవేర్‌ యూజర్లపై దాడి చేసింది. యూజర్లకు గుర్తు తెలియని నంబరు నుంచి ఒకటి లేదా రెండు వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ వచ్చి ఉంటాయి. కాల్‌ చేసే సమయంలోనే మాల్వేర్‌ కోడ్‌ ఫోన్లోకి ప్రవేశించింది. జరిగిన దానికి తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వాట్సాప్‌ యూజర్లు వెంటనే తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కంపెనీ కోరింది.

Back to Top