ప్రపంచకప్‌ నేపథ్యంలో ఐసీసీ వినూత్న నిర్ణయం

ప్రపంచకప్‌ నేపథ్యంలో ఐసీసీ వినూత్న నిర్ణయం

వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను అవినీతి రహితంగా నిర్వహించేందుకు ఐసీసీ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని నియమించనుంది. ‘సాధన శిబిరాలు, సన్నాహక మ్యాచ్‌లు, అసలైన మ్యాచులు ఆడేటప్పుడు వీరు ఆటగాళ్లను గమనిస్తారు. వారితో కలిసే హోటళ్లో ఉంటారు. వారితో కలిసే ప్రయాణాలు చేస్తారు’ అని ఓ ఐసీసీ అధికారి తెలిపారు. ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్నవారిపై, అనుమాస్పదంగా కదులుతున్న వారిపై వీరు కన్నేస్తారు. ఏదైనా జరిగే అవకాశం ఉందా అని పరిశీలిస్తారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగకుండా అవినీతి రహితంగా టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ఈ చర్య తీసుకుంది.

Back to Top