పదోతరగతి పాసైతే ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు..
- May 15, 2019
ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ఐసీజీ) డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జూన్ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు.. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) 10వ ఎంట్రీ- 02/2019 బ్యాచ్ పోస్టులు: కుక్, స్టీవార్డ్
అర్హత: 50 శాతం మార్కులతో పదవతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్ అభ్యర్థులు, కోస్ట్ గార్డ్ యూనిఫామ్ ఉద్యోగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.10.2019 నాటికి 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.10.1997 – 30.09.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా జీతభత్యాలు: ప్రారంభంలో బేసిక్ పే స్కేలు కింద నెలకు రూ.21,700 ఇస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ప్రమోషన్ సమయంలో ప్రధాన అధికారి హోదాలో నెలకు రూ.47,600 ఇస్తారు. ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 05.06.2019 ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేదీ : 10.06.2019 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 20 నుంచి 26 వరకు పరీక్ష నిర్వహణ: జూన్/జులై 2019 ఫలితాల వెల్లడి: సెప్టెంబరు 2019 శిక్షణ ప్రారంభం: అక్టోబరు 2019
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







