ఐడీ కార్డుల డిస్ట్రిబ్యూషన్: మూడో ఫేజ్ ప్రారంభం
- May 19, 2019
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో కొత్త లుక్‌తో కూడిన ఐడీ కార్డులకు సంబంధించి మూడో ఫేజ్ ప్రారంభమయ్యింది. ఈ మూడో పేజ్‌లో భాగంగా తొలి ఐడీ కార్డుని కొత్తగా జన్మించిన సుల్తాన్‌కి అందజేశారు. జనవరిలో ప్రారంభమయిన తొలి ఫేజ్‌లో, సాంకేతికంగా అత్యున్నత పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇది కేవలం కొత్తగా జన్మించినవారికే పరిమితం చేశారు. రెండో ఫేజ్‌లో ఆన్‌లైన్ ద్వారా ఇసా టౌన్, ముహర్రాక్ సర్వీస్ సెంటర్స్‌లోని ఫాస్ట్ ట్రాక్ లాంజెస్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి కొత్త ఐడీలను అందించారు. రెన్యూ చేసుకోవాల్సినప్పుడు, కార్డులు పోగొట్టుకున్నప్పుడు లేదా కార్డులు డ్యామేజీ అయినప్పుడు కొత్త కార్డుల్ని జారీ చేస్తున్నారు. ఈ ఐడీ కార్డులను కింగ్‌డమ్‌లో అధికారిక ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్‌గా ఉపయోగించడం జరుగుతోంది. హెల్త్ సంబంధమైన, బ్యాంకింగ్, పేమెంట్ వెరిఫికేషన్, అలాగే ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలకూ ఇది ఉపయోగపడ్తుంది. 2 బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో ఈ ఐడీ కార్డుల్ని అందిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..