లీసా3 సినిమా ఆడియో విడుదల
- May 19, 2019
గీతాంజలి, చిత్రాంగథ వంటి హర్రర్ చిత్రాల్లో నటించి మెప్పించిన టాలీవుడ్ సీతమ్మ అంజలి మరోసారి దెయ్యంగా కనిపించనుంది. ఈ మధ్యకాలంలో హర్రర్ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో 'లీసా' అనే చిత్రాన్ని త్రీడీ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.
తెలుగు నటి అంజలి మరోసారి హర్రర్ క్యారెక్టర్ నటిస్తున్న చిత్రం లీసా 3డి. ఈ చిత్రం ఇప్పటికే సూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఆదివారం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి అంజలతో పాటు, దర్శకుడు విశ్వనాథ్, నిర్మాత సురేష్ కొండేటి, హస్యనటుడు శివాజీ రాజా, రాజు విశ్వనాధ్ తదితరులు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ల్ లో పాల్గొన్నారు. '24' చిత్రానికి రచనా సహకారం అందించిన రాజు విశ్వనాత్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
త్రీడీ టెక్నాలజీతో దెయ్యాన్ని చూపించి థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తున్నా.. కంటెంట్ మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగే కనిపిస్తుంది. ఓ పాత ఫామ్ హౌస్.. అందులో ఓ దెయ్యం.. కుర్చీలు ఊగడం.. కర్టెన్స్ కదలడం.. కరెంట్ పోవడం లాంటివి బ్లాక్ అండ్ కాలం నుండి చూస్తునే ఉన్నాం. అయితే హారర్ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు. ఇక టీజర్‌తో పెద్దగా భయపెట్టలేకపోయిన అంజలి దెయ్యం.. 'లీసా' మూవీతో దడపుట్టిస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!









