తమిళనాడులో ఐసిస్ జాడలు కలకలం..
- May 21, 2019
తమిళనాడులో ఐసిస్ జాడలు కలకలం రేపాయి. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న 10 మంది ఇళ్లల్లో ఏకకాలంలో NIA సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర జరుగుతుందన్న అనుమానంతో తనిఖీలు జరుపుతున్నారు. లాల్‌పేట్, దేవీపట్టినం, కిలాకరాయి, ముత్తుపేట్, సాలెం తదితర 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఇప్పటివరకు కొన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో 3 ల్యాప్‌టాప్‌లు, 3 హార్డ్‌డిస్క్‌లు, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, 2 పెన్‌డ్రైవ్‌లు, 5 మెమొరి కార్డులు, ఒక కార్డ్ రీడర్లు ఉన్నాయి. అంతేగాక రెండు కత్తులు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గతంలో అధికారులు ఈ ప్రాంతాలకు చెందిన ఈ 10 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ‘2018లో ఆయుధాలు, నిధుల సేకరణ, ఉగ్ర భావజాల వ్యాప్తితో పాటు పలు కార్యకలాపాల కోసం వారు కుట్ర పన్నుతున్నారన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పది మందిలో 9 మందిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. ఇక నిందితులకు బెయిల్ లభించడంతో 9 మందిని విడుదల చేశారు. అయితే వారు తిరిగి ఐసిస్ కు సహాయం చేస్తున్నారన్న అనుమానంతో సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..