హీరోగా శ్రీహరి చిన్న కొడుకు
- May 21, 2019
విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు స్వర్గీయ, రియల్ స్టార్, డా. శ్రీహరి.. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగా 49 ఏళ్ళ వయసులో తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. తెరమీదే కాదు, తెర వెనక కూడా ఆయన రియల్ స్టారే.. పేదలకు సాయం, గ్రామల దత్తత వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు శ్రీహరి.. ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు.. ఇప్పుడు శ్రీహరి ఇంటినుండి మరో నటుడు తెరంగేట్రం చెయ్యనున్నాడు..
శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకు శశాంక్, మేఘాంశ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించిన భైరవ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో మేఘాంశ్ నటనకు మంచి స్పందన వచ్చింది. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న మేఘాంశ్, నటనకు సంబంధించిన అన్ని రంగాలలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మేఘాంశ్ మొదటి సినిమాని కార్తీక్ - అర్జున్ కలిసి డైరెక్ట్ చెయ్యనుండగా, ఈ సినిమాకి 'రాజ్ దూత్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..