దుబాయ్ ఆర్‌టిఎ, టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యం
- May 23, 2019భారత కన్సల్టెన్జీ జెయింట్ టాటా కన్సల్టెన్సీ, దుబాయ్ ఆర్‌టిఎకి సహాయ సహకారాలు అందించనుంది. ఓ స్మార్ట్ యాప్ ద్వారా డ్రైవర్లను మానిటర్ చేసేందుకు వీలుగా ఆర్‌టిఎతో కలిసి పనిచేయనుంది టాటా కన్సల్టెన్సీ. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ మేరకు ఓ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆర్‌టిఎ హెడ్ క్వార్టర్స్‌లో కుదిరిన ఈ ఒప్పందానికి సంబంధించి లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అబ్దుల్లా యూసెఫ్ అల్ అలి, టిసిఎస్ రీజినల్ డైరెక్టర్ అజయ్ సింగ్ సంతకాలు చేయడం జరిగింది. మూడు నెలల ట్రయల్ పీరియడ్‌లో టిసిఎస్ ఓ యాప్‌ని తయారుచేసి, ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్‌లోడ్ చేస్తారు. జిపిఎస్ నేవిగేటర్, 9 యాక్సిస్ ఐఎంయు వంటివి ఇందులోవ ఉంటాయి. ఓవర్ స్పీడింగ్, వీరింగ్, ఒక్కసారిగా బ్రేక్ వేయడం వంటివాటిని ఈ కొత్త సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ డేటా ఆధారంగా ఏ వయసువారు ఎక్కువ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు? వంటి అనేక విషయాల్ని విశ్లేషించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ