బీజేపీ గెలుపుతో యూఏఈలోని భారతీయుల సంబరాలు

బీజేపీ గెలుపుతో యూఏఈలోని భారతీయుల సంబరాలు

భారతదేశంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో యూఏఈలోని భారతీయులు ఉదయం నుంచే ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. ఎర్లీ ట్రెండ్స్‌ బీజేపీకి అనుకూలంగా వుండడంతో భారతీయ వలసదారులు యూఏఈలో సంబరాలకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ గెలుపు ఖాయమైందన్న అవగాహనకు వచ్చాక సంబరాలు షురూ చేశారు. ఎన్‌ఎంసి ఫౌండర్‌ బిఆర్‌ శెట్టి, బీజేపీ గెలుపుపై స్పందిస్తూ, నరేంద్రమోడీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుపు పై సజివ్ పురుషోత్తమన్(బి.జె.పి NRI కో-ఆర్డినేటర్) హర్షం వ్యక్తం చేసారు.ఇండియన్‌ లేడీస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అన్ను చౌరారియా మాట్లాడుతూ, మోడీని విజనరరీ లీడర్‌గా అభివర్ణించారు. దేశాభివృద్ధికి ఈ ఎన్నికలు ఎంతగానో దోహదం చేస్తాయని దీపక్‌ కుమార్‌ దాస్‌ అనే ఒరిస్సాకి చెందిన వ్యక్తి చెప్పారు. కాగా, కొందరు వలసదారులు కాంగ్రెస్‌ విజయాన్ని ఆకాంక్షించారు. వారంతా నిరాశలో మునిగిపోయారు. 

 

Back to Top