కాబూల్‌లో బాంబు దాడి.. ఇద్దరి మృతి
- May 24, 2019
ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ సమీపంలోని పక్టియాకోట్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ప్రార్థనా మందిరంలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మత గురువు ఇమామ్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అయితే బాంబు దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీలు ఉంటారు. వీరిలో చాలామంది తాలిబన్లకు అనుకూలంగా ఉంటారు’’ అని వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..