పెస్టిసైడ్‌ వాసన పీల్చిన 10 ఏళ్ళ చిన్నారి మృతి

పెస్టిసైడ్‌ వాసన పీల్చిన 10 ఏళ్ళ చిన్నారి మృతి

10 ఏళ్ళ పాకిస్తానీ చిన్నారి పెస్టిసైడ్‌ని ఇన్‌హాలేషన్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని అల్‌ నహ్దా ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోమల్‌ ఎస్‌ ఖాన్‌ అనే చిన్నారి పెస్టిసైడ్‌ వాసన పీల్చి అస్వస్థతకు గురికాగా, హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందడం జరిగింది. చిన్నారి తల్లి ఆరిఫా షాఫి ఖాన్‌, తండ్రి షఫీయా అల్లాహ్‌ ఖాన్‌ కూడా ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థతకు గురైన ఆసుపత్రిలో చేరారు. అయితే ఆ తర్వాత వారు డిశ్చార్జ్‌ అయ్యారు. టాక్సిక్‌ కెమికల్స్‌ ప్రభావానికి వారు గురైనట్లు ఫ్యామిలీ మెడికల్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. అల్యూమినియమ్‌ ఫాస్ఫైడ్‌ అనే కెమికల్‌ ఈ దారుణానికి కారణమైందని ఫోరెన్సిక్‌ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ప్రొఫెషనల్‌ పెస్ట్‌ కంట్రోల్‌ కంపెనీల సాయం లేకుండా అపార్ట్‌మెంట్‌ టెనెంట్స్‌ ఈ కెమికల్‌ని వాడి వుంటారని అనుమానిస్తున్నారు.  

Back to Top