దుబాయ్‌ స్కూల్స్‌కి లాంగ్‌ ఈద్‌ అల్‌ ఫితర్‌ బ్రేక్‌ ప్రకటన

దుబాయ్‌ స్కూల్స్‌కి లాంగ్‌ ఈద్‌ అల్‌ ఫితర్‌ బ్రేక్‌ ప్రకటన

నాలెడ్జ్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కెహెచ్‌డిఎ), ఈద్‌ అల్‌ ఫితర్‌ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. ఆదివారం జూన్‌ 2 నుంచి గురువారం జూన్‌ 6 వరకు సెలవులు వుంటాయి. ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఈద్‌ హాలీడేస్‌ ప్రకటన నేపథ్యంలో స్కూళ్ళకు సెలవులపై ప్రకటన వచ్చింది. పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులు వారం రోజులపాటు లాంగ్‌ వీకెండ్‌ హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేయడానికి అవకాశం దక్కింది. జూన్‌ 2 ఆదివారం నుంచి ప్రారంభమయ్యే సెలవులు జూన్‌ 8వ తేదీతో ముగుస్తాయి. వర్క్‌ తిరిగి జూన్‌ 9న ప్రారంభమవుతుంది. ప్రైవేట్‌ సెక్టార్‌ ఉద్యోగులు తక్కువలో తక్కువగా 4 రోజులు సెలవులు పొందేందుకు వీలుంది. 

 

Back to Top